Womens Day 2024 Tollywood Lady Directors: మహిళలు ఈ మధ్య కాలంలో మగవాళ్లకు పోటీగా అన్నీ రంగాల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక సినీ ఫీల్డ్ విషయానికొస్తే తెరపైనే కాదు తెరవెనుక కూడా రాణిస్తున్నారు. ఆర్టిస్టులకు మేకప్ వేసే దగ్గర నుంచి యాక్షన్ చెప్పడం, నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం సహా అన్ని విభాగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. తమ ప్రతిభతో సినీ రంగానికి మరిన్ని రంగులు అద్దుతూ ఆకట్టుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెర వెనుక ఉన్న 'స్త్రీ'నిమా లోకం గురించి తెలుసుకుందాం.
భానుమతి రామకృష్ణ- తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరంలో భానుమతి రామకృష్ణ దర్శకురాలిగా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా, నేపథ్య గాయనిగా కెరీర్లో ముందుకెళ్లారు. వర విక్రయం, చండీరాణి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సావిత్రి ఆరు సినిమాలకు డైరెక్షన్ చేశారు. విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డుల్లోనూ ఎక్కారు.
జీవితా రాజశేఖర్- ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి చేయగా బి. జయ - చంటిగాడు, లవ్లీ, సుచిత్ర చంద్రబోస్- పల్లకిలో పెళ్లి కూతురు, శ్రీప్రియ - దృశ్యం సినిమాలు చేశారు.
నందిని రెడ్డి- ఇప్పటి తరం వారిలో నందిని రెడ్డి తొలి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకురాలి’గా నంది పురస్కారం అందుకుంది. అలా మొదలైందితో ప్రయాణం మొదలైంది. కళ్యాణ వైభోగమే, జబర్దస్త్, ఓ బేబీ, అన్నీ మంచి శకునములే వంటి చిత్రాలు చేసింది. ఇక సుధా కొంగర - గురు, ద్రోహి, ఆకాశమ నీ హద్దురా చేశారు.