తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గేమ్‌ ఛేంజర్‌'లో నటనకు రామ్‌ చరణ్‌కు జాతీయ అవార్డు రావాలి : సుకుమార్‌ ఫస్ట్ రివ్యూ - SUKUMAR REVIEW ON GAME CHANGER

'గేమ్‌ ఛేంజర్‌' మూవీపై దర్శకుడు సుకుమార్‌ ఫస్ట్‌ రివ్యూ - రామ్‌చరణ్‌ నటనకు జాతీయ అవార్డు రావచ్చని జోస్యం!

Sukumar Review On Game Changer
Sukumar Review On Game Changer (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2024, 5:32 PM IST

Sukumar Review On Game Changer : 'రంగస్థలం'లో రామ్‌చరణ్‌ నటనకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నా అంటూ సినీ దర్శకుడు సుకుమార్‌ అన్నారు. కానీ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా క్లైమాక్స్‌లో చరణ్‌ నటనకు కచ్చితంగా అవార్డ్‌ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ తమిళ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌'. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక అమెరికాలో చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లోనే సుకుమార్‌ రామ్ చరణ్ నటన గురించి మాట్లాడారు.

"నేను సినిమా చేసేటప్పుడు నా హీరోలందరినీ నేను ప్రేమిస్తా. ఓ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం ఒకట్రెండేళ్లు ఉంటుంది. కానీ సినిమా అయిపోయిన తర్వాత వాళ్లతో పెద్దగా కనెక్ట్‌ అయి ఉండను. కానీ రంగస్థలం పూర్తయినా తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక్క హీరో రామ్‌ చరణ్‌. తను నా సొంత సోదరుడులాంటి వాడు. మా మధ్య చాలా విషయాలు చర్చకు వస్తాయి. మీకొక సీక్రెట్ చెప్పాలి. చిరంజీవిగారితో కలిసి 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా చూశాను. అందుకే ఈ సినిమా ఫస్ట్‌ రివ్యూ నేనే ఇస్తున్నాను. ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్‌ అయితే ఇక బ్లాక్‌ బస్టరే. సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ చూస్తే గగుర్పాటు కలుగుతుంది. శంకర్‌గారి సినిమాలు 'జెంటిల్‌మెన్‌', 'భారతీయుడు' చూసి ఎంత ఎంజాయ్‌ చేశానో, అంతలా ఈ మూవీని కూడా ఆస్వాదించాను. 'రంగస్థలం' చిత్రానికి రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాం. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్‌ కలిగింది. వాస్తవానికి అంతకన్నా ఎక్కువగానే0 అనిపించింది. రామ్ చరణ్‌ చాలా బాగా చేశాడు. అతని నటనకు ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా" అని సుకుమార్‌ అన్నారు.

రిలీజ్ డేట్ ఇదే!
సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కానుంది.

శంకర్‌ బెస్ట్‌ మూవీని ఈ సారి చూడనున్నారు : రామ్‌ చరణ్‌

టెక్సాస్ ఫ్యాన్​ మీట్​లో చెర్రీ సందడి - 'ఈ సారి మిమల్ని అస్సలు నిరాశపరచను'

ABOUT THE AUTHOR

...view details