తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెండు సంప్రదాయాల వివాహం - ఒక్కటైన రకుల్, జాకీ జంట

Rakul Jacky Marriage : బాలీవుడ్ స్టార్ జంట రకుల్ ప్రీత్ సింగ్​, జాకీ భగ్నానీ నేడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే ఈ జంట సిక్కుల సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారట. ఇప్పుడు మరో ఆచారం ప్రకారం వీరి పెళ్లి జరగనుంది.

Rakul Preet Singh Jackky bhagnani Married
Rakul Preet Singh Jackky bhagnani Married

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 4:03 PM IST

Updated : Feb 21, 2024, 5:00 PM IST

Rakul Jacky Marriage : బాలీవుడ్ క్యూట్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్​, జాకీ భగ్నానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. గోవాలో జరుగుతున్న ఈ వేడుకకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. రెండు రకాల పద్ధతుల్లో ఈ జంట వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు (ఫిబ్రవరీ 21)న ఈ జంట తొలుత సిక్కుల సంప్రదాయం ప్రకారం ఆనంద్​ కారజ్ అనే పద్ధతిలో వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే వివాహ వేడుకకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేడుకుకు ఆదిత్య రాయ్​ కపూర్​, అనన్య పాండే, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ దంపతులు, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని సమాచారం.

సంగీత్​లో బాలీవుడ్ కపుల్స్ డ్యాన్స్​
Rakul Jacky Prewedding Celebrations : ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా గ్రాండ్​గా జరిగాయి. పెళ్లికి వచ్చిన అతిథులు తాజాగా జరిగిన సంగీత్​లో సందడి చేశారు. బాలీవుడ్​ కపుల్స్​ వరుణ్‌ ధావన్‌ నటాషా, శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా ఇలా పలువురు స్టార్స్​ సంగీత్‌లో పాల్గొని స్టెప్పులేశారు. ఇక హల్దీ, మెహందీ వేడుకలు కూడా బాగా జరిగాయి. గతంలో ఈ జంట తమ ఫ్రెండ్స్​కు గ్రాండ్ బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఈ జంట వెడ్డింగ్ కార్డ్​ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అబ్​ దోనో భాగ్​నా - నీ ( ఇక ఇద్దరు ఎక్కడికి పరిగెట్టద్దు అని అర్థం, దీంతో పాటు జాకీ భాగ్​నానీ సర్​ నేమ్​ను కూడా ఇందులో మెన్షన్ అయ్యింది) అనే హ్యాష్​ ట్యాగ్​ను ప్రింట్​ చేశారు. సరికొత్తగా ఉన్న ఈ హ్యాష్​ట్యాగ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Rakul Jacky Love Story : ఇక గత కొంత కాలంగా రిలేషన్​లో ఉన్న రకుల్‌, జాకీ తమ ప్రేమ విషయాన్ని 2021లో అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ జంట తమ స్వీట్​ మూమెంట్స్​కు సంబంధించిన ఫొటోలను అప్​లోడ్ చేస్తూ సందచి చేశారు. అప్పుడప్పుడు బయటతిరుగుతూ పలు మార్లు కెమెరాకు చిక్కారు.

రకుల్ తొలి జీతం ఎంతో తెలుసా? - అలాంటి పని చేసి సంపాదించిందట!

లగ్జరీ హోటల్‌లో రకుల్ పెళ్లి - అక్కడ ఒక్క రూమ్ ధర ఎంతంటే ?

Last Updated : Feb 21, 2024, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details