War 2 Shooting Update: యాక్టింగ్ పవర్ హౌజ్, ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్‌ను ఇద్దరిని కలిపింది- బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'వార్ 2'. ప్రముఖ డైరెక్టర్ 'బ్రహ్మస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. వార్ సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ఇందులో కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా- హృతిక్‌కు అపోజిట్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్లో ఇంకా వీరిద్దరూ జాయిన్ అవ్వలేదు.
తాజాగా ఈ సినిమా గురించి హృతిక్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. "ఫైటర్ అయిపోయింది. ఇక బ్రేక్ లేకుండా వార్ 2లోకి ఎంటర్ అవుతున్నాను. అనుకున్న దానికన్నా ముందే వార్ 2 మొదలవుతుంది. ఎంత త్వరగా అంటే నాకు ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా లేనంత. అప్పుడు కబీర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయలేను కానీ కబీర్ ఈసారి ఇంకా కొత్తగా కనిపిస్తాడు" అని హృతిక్ చెప్పుకొచ్చారు.
కాగా, ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు అని అనౌన్స్ చేయగానే దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ తెగ సంతోషపడిపోయారు. అనౌన్స్మెంట్తోనే ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ చిత్రాల్లో ఇది ఏడో సినిమాగా తెరకెక్కుతోంది.