తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వార్ 2 : 100 రోజులు - రూ.100 కోట్లు! - War 2 Hrithik Roshan NTR

War 2 Hrithik Roshan NTR : ఎన్టీఆర్ - హృతిక్ రోషన్​ కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వార్​ 2. తాజాగా ఈ చిత్రం కోసం వీరిద్దరు భారీగా బల్క్​ డేట్స్​ ఇచ్చారని తెలిసింది. అలాగే కళ్లు చెదిరే రేంజ్​లో పారితోషికం తీసుకుంటున్నారని తెలిసింది. ఆ వివరాలు.

వార్ 2 - 100 రోజులు - రూ.100 కోట్లు!
వార్ 2 - 100 రోజులు - రూ.100 కోట్లు!

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 8:39 AM IST

War 2 Hrithik Roshan NTR :ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వార్ 2 కూడా ఒకటి. నిజానికి మొదట ఈ సీక్వెల్​ను అనౌన్స్​ చేసినప్పుడు ఇది ఒక బాలీవుడ్​ సినిమా మాత్రమే. కానీ ఎప్పుడైతే ఈ రెండో భాగంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్​ ఎంటర్ అయ్యారో అప్పటినుంచి సినిమాపై భారీ రేంజ్​లో హైప్ క్రియేట్ అయింది. పైగా హృతిక్ రోషన్​తో కలిసి ఎన్టీఆర్​ నటిస్తున్నారు అనగానే అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది.

ఇంతకీ అదేంటంటే ?భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ వార్​ 2 షూటింగ్ మొదలైపోయిన సంగతి తెలిసిందే. కానీ షూటింగ్​ సెట్​లో ఇప్పటి వరకు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అడుగు పెట్టలేదు. మొదట హృతిక్ ఆ తర్వాత తారక్​ సెట్స్​లోకి వెళ్తారని ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోలు కూడా భారీగా బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్టీఆర్ 100 రోజుల కాల్ షీట్స్, హృతిక్ రోషన్ కూడా 100 రోజుల డేట్స్​ ఇచ్చారట. ఇక ఈ ఇద్దరు హీరోలకు సమంగా వర్కింగ్ డేస్ ఉండటం వల్ల రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అంతా భావిస్తున్నారు.

100 కోట్లు రెమ్యునరేషన్: ఈ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్​ - ఎన్టీఆర్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్​ రా ఏజెంట్​గా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే వీరిద్దరు రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకోకునున్నారని బయట టాక్ నడుస్తుంది. ఈ లెక్కన సినిమా బడ్జెట్ రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే రీసెంట్​గానే హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీగానే వసూలు చేసింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. మరో వారంలో గోవాలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే వార్ 2 సెట్స్​లో ఎన్టీఆర్ అడుగుపెడతారని సమాచారం అందింది.

'అసూయ, బాధతో చెబుతున్నా' - ఆ కొత్త హీరోయిన్​కు ఫిదా అయిపోయిన జక్కన్న!

హనీమూన్ రోజే స్టార్ హీరోయిన్​ను వేలం వేసిన భర్త - చిత్రహింసలు పెడుతూ నరకం!

ABOUT THE AUTHOR

...view details