తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విశ్వంభర : త్రిషను సర్​ప్రైజ్ చేసిన చిరంజీవి - ఆ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి - Chiranjeevi Sents gift to trisha

Viswambara Chiranjeevi Trisha : హీరోయిన్ త్రిషకు మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఏంటంటే?

విశ్వంభర : త్రిషను సర్​ప్రైజ్ చేసిన చిరంజీవి - ఆ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి
విశ్వంభర : త్రిషను సర్​ప్రైజ్ చేసిన చిరంజీవి - ఆ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 3:44 PM IST

Viswambara Chiranjeevi Trisha : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తన అభిమానులను అలరించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. కానీ ఆయనకు మాత్రం సరైన హిట్ దక్కడం లేదు. ఖైదీ నెంబర్ 150తో మొదలైన ఆయన సెకండ్ ఇన్నింగ్స్​ సైర నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, ఆచార్య, భోళాశంకర్ వంటి చిత్రాలతో ముందుకెళ్లింది. కానీ అందులో వాల్తేరు వీరయ్య తప్ప ఇతర చిత్రాలేమీ భారీ సక్సెస్​ను సాధించలేకపోయాయి.

దీంతో ఆయన ఆచితూచి మరీ బింబిసార దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. విశ్వానికి మించి అంటూ రిలీజైన పోస్టర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెత్​తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

త్రిషకు స్పెషల్ గిఫ్ట్​ : అయితే సాధారణంగానే చిరుకు చిత్ర పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీలకు బహుమతులు పంపే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. అలా తాజాగా త్రిషకు ఓ స్పెషల్ అండ్ వెరైటీ గిఫ్ట్ పంపించారాయన. టెంపరేచర్ కంట్రోల్డ్ ఫ్యాన్సీ మగ్​ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది. థ్యాంక్య్ కూడా​ చెప్పుకొచ్చింది.

18ఏళ్ల తర్వాత మళ్లీ : ఇకపోతే 2006లో విడుదలైన స్టాలిన్‌ చిత్రంలో తొలిసారి చిరు - త్రిష కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్​ను అందుకుంది. మళ్లీ దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఈ విశ్వంభర కోసం పని చేస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో.

ఇక త్రిష కూడా సెకండ్ ఇన్నింగ్స్​లో దూసుకెళ్తోంది. ఆ మధ్య విడుదలైన పొన్నియిన్ సెల్వెన్​ చిత్రంలో తన గ్లామర్ యాక్టింగ్​తో ఆడియెన్స్​ను ఫిదా చేసింది. ఆ తర్వాత లియోతో పాటు మరో చిత్రంలోనూ మెరిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో థగ్స్ లైఫ్​, ఐడెంటిటీ, రామ్, విదా ముయార్చి చిత్రాలు ఉన్నాయి.

జోరు చూపిస్తున్న విశ్వక్‌ సేన్‌ 'గామి' - రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?

OTTలో రియల్ క్రైమ్ స్టోరీ - 18 దేశాల్లో టాప్​ ట్రెండింగ్‌!

ABOUT THE AUTHOR

...view details