Vishwak Sen Birthday: యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. రీసెంట్గా గామి సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్లో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందాడు. అయితే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ, తనకంటూ ఓ ఫ్యాన్‌బేస్ ఏర్పర్చుకున్న విశ్వక్ తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడింది ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
విశ్వక్ కెరీర్లో ఏదీ ఈజీగా రాలేదట. ఒకవేళ వస్తే అది తనకే షాకింగ్ గా అనిపిస్తుందని చెప్తున్నాడు. కెరీర్ కొత్తలో నటించిన 'వెళ్లిపోమాకే' సినిమా ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపు తీసుకురాలేదని ఆ తర్వాత ఆఫర్లు రాలేదని ఏడ్చానని కూడా చెప్పాడు. అలాంటి సమయంలో సినిమా ఆడిషన్లకు వెళ్లడం, సెలక్ట్ కాకపోవడం వంటివి చూసి తన తండ్రి 'మనమే సినిమా తీద్దాం ఎందుకురా అంత బాధపడతావు' అని ధైర్యం చెప్పారట. అలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే 'ఫలక్‌నుమా దాస్'.
దీని గురించి చర్చించుకుంటున్న సమయంలోనే తరుణ్ భాస్కర్ కొత్త కథని రెడీ చేసుకున్నాడని వేరే ఎవరో చెప్పారట. ఆడిషన్ ఇవ్వమని అంటే ముందుగా ఫొటో పంపిచూశాడట. తనకు ఇలాంటి వ్యక్తే కావాలని చూస్తున్నానని తరుణ్ వెంటనే విశ్వక్‌ను సెలక్ట్ చేసేశాడట. కాకపోతే కొద్ది రోజుల తర్వాత విశ్వక్‌సేన్ గురించి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చి రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారట. ఆ డౌట్ క్లియర్ చేసుకుని సినిమాలో అవకాశం దక్కించుకున్నానని, ఆ విషయంలో తరుణ్ భాస్కర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పాడు. జీవితాంతం తరుణ్ భాస్కర్‌కు రుణపడి ఉంటానని వెల్లడించాడు.