Heroine Trisha 200 Crore Club : సినీ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా తరగని అందంతో ఇప్పటికీ అదే వన్నెతో సినీ ప్రేక్షకులను కట్టిపాడేస్తున్న హీరోయిన్ త్రిష. ఒకప్పుడు ఫుల్ జోష్తో తెలుగు, తమిళ ఇండస్ట్రీని అలరించిన ఈ భామ ఆ మధ్య ఒకానొక దశలో మోహినీ, నాయకీ లాంటి వరుస ఫ్లాపులను చవిచూసింది. ఇక త్రిష కెరీర్ క్లోజ్ అని అంతా అనుకునే సమయంలో 96 వంటి సూపర్ హిట్ సినిమాలో కనిపించి ఐయామ్ బ్యాక్ అనిపించుకుంది. అప్పటి నుంచి కథా బలమున్న పాత్రలను ఎంచుకొని తిరుగులేని నటనతో రాణిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి గిరాకీ బాగానే ఉందని చెప్పాలి. ఫ్లాపుల నుంచి నేర్చుకున్న పాఠాలో లేక టైమ్ కలిసొచ్చిందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో త్రిష నటించిన సినిమాలన్నీ వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. నలబై ఏళ్లు దాటిన ఈ అమ్మడు ఏవో చిన్న చిన్న సినిమాల్లో నటించి సరిపెట్టుకోవడం లేదు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూపు మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా బడా బడా హీరోలతో కలిసి నటిస్తూ ఒక్కో సినిమాతో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంటోంది.
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్వకత్వంలో తెరకెక్కిన లియో తమిళంలోని టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 2023లో విడుదలైన ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే దాదాపు రూ. 230కోట్ల గ్రాస్ వరకూ వసూళ్లను సాధించింది.
అంతేకాదు, మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ 1లో కూడా త్రిష - విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీలతో పోటీపటి నటించి ఇందులో మెప్పించింది. తమిళనాట ఈ సినిమా కలెక్షన్లు కూడా రూ.220 కోట్లకు పై మాటే. ఆ రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్ తమిళ గ్రాసర్ సినిమాగా నిలిచింది.