Virat Kohli Chiranjeevi Songs : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని అతడి ఫ్రెండ్ రవితేజ రివీల్ చేశాడు. కోహ్లీకి టాలీవుడ్లో ఓ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమని, అంతేకాకుండా ఆయన పాటలను చాలా ఇష్టంగా వినేవారంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. అంతే కాకుండా వారిద్దరూ ఓ నిక్‌నేమ్‌తో పిలుచుకునేవారని వెల్లడించాడు.
" నేను, కోహ్లీ కలిసి అండర్ 15 డొమెస్టిక్ క్రికెట్ ఆడాం. ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకునేవాళ్లం. అప్పుడు రోజూ మేము చిరంజీవి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్లం. కోహ్లీకి చిరు సాంగ్స్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు మేమిద్దరం కూడా సరదాగా ఒకరినొకరు చిరు అని పిలుచుకునేవాళ్లం. అయితే మేమిద్దరం ఆరేళ్ల తర్వాత కలిసినప్పుడు కూడా చిరంజీవి ఎలా ఉన్నారు అని కోహ్లీ అడిగాడు." అంటూ కోహ్లీతో తన ఫ్రెండ్షిప్ను పంచుకున్నారు.
ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కోహ్లీ కూడా చిరు ఫ్యానా? అని సంబరాలు చేసుకుంటున్నారు. చిరు అంటే మాములుగా ఉండదు మరి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. 'బింబిసార' ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. త్రిష, అశికా రంగనాథ్, ఇషా, సురభి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.