Thalapathy 69 Movie Update : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'ది గోట్' ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతోంది. ఇంతలోనే విజయ్ చివరి సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెట్టింట్లో #Thalapathy69 హ్యాష్ ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. విజయ్ ఫ్యాన్స్ అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే సినిమా గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ, చిత్రానికి సంబంధించిన పలు విషయాలు, తారాగణం గురించి డీటెయిల్స్ బయటకు వచ్చాయి.
విజయ్ 69వ చిత్రంగా రానున్న ఈ చిత్రాన్ని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రానుంది. డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా రిలీజైంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేదా హీరోయిన్ పూజా హెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Thalapathy 69 Heroine :ఒకవేళ సమంత ఈ చిత్రంలో నటిస్తే, విజయ్‌తో ఆమెకు ఇది నాలుగో చిత్రం అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో థేరీ, కత్తి, మెర్సల్ సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. దీంతో వీరిని హిట్ పెయిర్ అని అంటుంటారు. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకవేళ పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తే, విజయ్‌తో ఆమెకు ఇది రెండోది అవుతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన బీస్ట్ పర్వాలేదనిపించింది.