Happy Birthday Vijay Thalapathy GOAT Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). అయితే నేడు విజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డ్యుయెల్ రోల్లో విజయ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఒకే బైక్‌పై ఇద్దరు విజయ్‌లు గన్లతో స్టంట్లు చేస్తూ కనిపించారు. ముఖ్యంగా డీఏజింగ్ టెక్నాలజీ ద్వారా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించిన విజయ్ యంగ్ అండ్ యాక్షన్ లుక్ బాగుంది. యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. అలానే ఈ చిత్రం సెప్టెంబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫుల్ ఖుషీతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
Goat Movie Cast and Crew : కాగా, సినిమాలో సాంకేతికతకు పెద్దపీట వేయనున్నట్లు గతంలోనే వెంకట్ ప్రభు పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీని విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కు పనిచేసిన సాంకేతిక నిపుణులు దీనికి పని చేశారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులు ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేశారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది.