తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి కథతో విజయ్ దేవరకొండ! - Vijay Devarkonda New Movie - VIJAY DEVARKONDA NEW MOVIE

Vijay Devarkonda Dilraju New Movie : విజయ్ దేవరకొండ మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి కథతో రాబోతున్నట్లు సమాచారం అందింది. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 3:37 PM IST

Vijay Devarkonda Dilraju New Movie : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ ఇమేజ్ బోలెడంత ఉన్నా సరైన హిట్ మాత్రం చాలా కాలం నుంచి పడలేదు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి. ఆ మధ్య ఖుషి మూవీ పర్వాలేదనిపించినా రీసెంట్​గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మిక్స్​డ్​ టాక్​తో ఫైనల్​ రన్​లో చేతులెత్తేసింది.

దీంతో విజయ్ తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన లైనప్​లో రాజావారు రాణిగారు ఫేమ్ దర్శకుడు రవి కిరణ్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఫ్యామిలీ స్టార్​ను నిర్మించిన దిల్​ రాజునే నిర్మిస్తారట. రీసెంట్​గానే మొత్తం స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.

అంటే చాలా కాలం తర్వాత మళ్లీ విజయ్ పొలిటికల్ కథను టచ్ చేయబోతున్నారనమాట. ఇందులో విజయ్ పొలిటికల్ లీడర్​గా కనిపిస్తారని అంటున్నారు. ఒక మంచి సోషల్ ఎలిమెంట్​ను ఇందులో చూపిస్తారట. అయితే గతంలో రౌడీ హీరో నోటా అనే పొలిటికల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్​గానే రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. మళ్లీ ఇంత కాలానికి రాజకీయ నేపథ్యంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు విజయ్.

దర్శకుడు రవి కిరణ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 9న ఈ మూవీని అఫీషియల్​గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే నిర్మాత దిల్​రాజుతో మరో సినిమా కూడా చేయనున్నారు విజయ్​. ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్​తో రానుందని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు ఇప్పటికే విజయ్​ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాక సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. చూడాలి మరి ఈ సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న విజయ్​కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో.

మహేశ్​, బన్నీతో అలా చేయాలని ఉంది : ప్రసన్న వదనం బ్యూటీ - PrasannaVadanam

మహేశ్​ను నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? - Mahesh babu Namratha

ABOUT THE AUTHOR

...view details