Vijay Devarkonda Mrunal Thakur family Star Teaser :టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం ఫేమ్ పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ నెట్టింట మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇది కూడా ఇంప్రెస్సింగ్గా ఉంది.
ఇందులో విజయ్ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నాయి. మధ్య తరగతి కుర్రాడిలా, పక్కింటి అబ్బాయిలా తన అప్పియరెన్స్‌తో ఆకట్టుకున్నాడు. దేఖోరే, దేఖోరే, దేఖోరే దేఖో కలియుగ రాముడు వచ్చిండు కాకో అంటూ ర్యాప్ సాంగ్‍తో ఈ ఫ్యామిలీ స్టార్ టీజర్ మొదలైంది. ఇందులో ఓ వైపు ఫ్యామిలీ మెన్‌గా కనిపిస్తూనే మరోవైపు రౌడీల బొక్కలు ఇరగొట్టేలా విజయ్ కనిపించాడు. ఆ తర్వాత ప్రచార చిత్రం చివర్లో ఏవండి, కాలేజ్‍కు వెళ్లాలి కొంచెం దించేస్తారా అని మృణాల్ ఠాకూర్ అడగగా ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అంటూ విజయ్ చెప్పడం నవ్వులు పూయించింది.