Dilraju Vijay Devarkonda Movie : దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండకు హిట్ దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్‌లోనే దిల్ రాజు విజయ్‌తో మరొక మూవీ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అలానే విజయ్ పుట్టినరోజు సంధర్భంగా సోషల్ మీడియాలో వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకుడిగా ఒక మూవీ చేయననున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుంటారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.
పైగా సాయి పల్లవి ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్లో నాని సరసన ఎమ్సీఏ అనే మూవీ కూడా చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్, నిర్మాత భావిస్తున్నారట. అసలు సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని ఈ కారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు డైరెక్టర్ చెప్తున్నారని ఇండస్ట్రిలో టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే విజయ్‌తో సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. కానీ విజయ్ దేవరకొండ చిత్రాల్లో సహజంగా ఉండే రొమాంటిక్ సన్నివేశాలకు మరి సాయి పల్లవి ఓకే అంటుందా అనేది చూడాలి.
Saipallavi Upcoming Movies : ఇక విజయ్ ఈ మూవీ కన్నా ముందు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మమిత బైజు లేదా భాగ్యశ్రీ బోస్ గాని నటించే అవకాశం ఉంది. సాయి పల్లవి విషయానికొస్తే ఆమె కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరం అయినా ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలతో ఫామ్‌లోకి వచ్చింది. త్వరలోనే నాగ చైతన్యతో నటించిన తండేల్తో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఆపైన అమీర్ ఖాన్ తనయుడితో చేస్తున్న మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత రణబీర్ రాముడిగా నటిస్తున్న రామాయణ్‌లో సీతగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
సాయి పల్లవి ఆ హీరోతో అలా చేస్తుందా? - Saipallavi - SAIPALLAVI
Dil raju Vijay Devarkonda Movie : సాయిపల్లవి మరో తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో
Saipallavi (Source ETV Bharat)
Published : May 15, 2024, 10:46 AM IST