Varsha Bollamma Valentines Day Wishes :తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎన్నో సినిమాల్లో సందడి చేసింది నటి వర్ష బొల్లమ్మ. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌లో ఎనర్జీని నింపుతుంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులకు విన్నూత్న రీతిలో వాలెంటైన్స్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
" సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోండి. మీపై జోకులు వేస్తే నవ్వుకోండి. ఇవాళ లవర్స్ డే కాబట్టి అదృష్టవంతులకు హ్యాపీ ఫ్రెండ్షిడ్ డే, అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు" అంటూ ఫన్నీగా విష్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసి మొదట కన్ఫ్యూజ్ అయిన నెటిజన్లు, ఆ తర్వాత ఆమె హ్యూమర్ సెన్స్‌కు 'వావ్' అంటున్నారు.
Varsha Bollamma Career : ఇక వర్ష కెరీర్ విషయానికి వస్తే - డబ్‌స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన వర్ష, కోలీవుడ్ మూవీ 'శాతురన్'తో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. '96' అనే తమిళ సినిమాలో ఆమె ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. అయినప్పటికీ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.