Varalakshmi Sarathkumar Sabari Movie Review
చిత్రం: శబరి;
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్ తదితరులు; సంగీతం: గోపి సుందర్;
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల;
సినిమాటోగ్రఫీ: రాహుల్; వాత్సవ, నాని చమిడిశెట్టి;
నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల;
దర్శకత్వం: అనిల్ కాట్జ్;
విలక్షణమైన నటనతో ఈ మధ్య క్రేజ్ పెంచుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. రీసెంట్గా హను-మాన్‌తో అందర్నీ మెప్పించింది. ఇప్పుడామె శబరిగా సందడి చేసేందుకు వచ్చేసింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే : చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన సంజన(వరలక్ష్మీ శరత్ కుమార్) ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ (గణేశ్ వెంకట్రామన్) చేతిలోనూ మోస పోతుంది. దీంతో ఆమె తన కూతురు రియా (నివేక్ష)తో ముంబయి నుంచి వైజాగ్‌కు వచ్చేసి జీవిస్తుంటుంది. ఈ క్రమంలోనే తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్ (శశాంక్)ను కలుస్తుంది. అతడి రిఫరెన్స్‌తోనే ఓ కంపెనీలో జుంబా ట్రైనర్‌గా ఉద్యోగం అందుకుని వైజాగ్ శివారు ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగుతుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో సంజనకు సైకోగా మారిన సూర్యం (మైమ్ గోపి) అనే వ్యక్తి నుంచి బెదరింపులు మొదలవుతాయి. రియా తన కూతురని, ఆ పాపను తనకు అప్పగించాలని లేదంటే చంపేస్తానని వెంటపడటాడు. మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయిస్తాడు. మరి తన కూతురిని కాపాడుకునేందుకు సంజన చేసిన పోరాటమే ఈ కథ.
ఎలా సాగిందంటే : కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ కథ. కథలో కొన్ని ట్విస్ట్‌లు థ్రిల్‌ను పంచినప్పటికీ పూర్తి స్థాయిలో సినిమా అంతగా మెప్పించలేదు. స్క్రీన్‌ప్లే పేలవంగా ఉంది. కథలో సంఘర్షణ, భావోద్వేగాలు అంతగా కనిపించలేదు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయంతోనే అయిపోయింది. అంతా బోరింగ్.
సైకో సూర్యం ఎంట్రీతో అసలు కథ మొదలు. అతడిను తప్పించుకునేందుకు సంజన చేసే ప్రయత్నాలు కాస్త థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ మొదలైన కాసేపటికే మళ్లీ బోర్. అక్కడక్కడా థ్రిల్ కనపడుతుంది. సూర్యం పాత్ర మొదట్లో కాస్త థ్రిల్లింగ్ ఇచ్చినా క్లైమాక్స్‌లో తేలిపోతుంది. సినిమాని ముగించిన తీరు అంతగా బాలేదు.
ఎవరెలా చేశారంటే : సింగిల్ మదర్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ నటన నేచురల్. ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. కథలో బలం లేకపోయినా సినిమాను తన భుజాలపై వేసుకుంది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన కూడా బాగుంది. అరవింద్‌గా గణేశ్ వెంకట్రామన్తో పాటు ఇతర పాత్రలకు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు అనిల్ తన కథలో కాస్త కొత్తదనం చూపించిన చక్కగా ముస్తాబు చేయలేకపోయాడు. అసలీ చిత్రానికి శబరి అనే పేరు ఎందుకు పెట్టారో స్పష్టత రాలేదు. గోపీసుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బలం. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్న సుహాస్ బయటపడ్డాడా? - Prasanna vadhanam Review
మాహిష్మతి మీదకి దండెత్తిన కట్టప్ప - 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' స్ట్రీమింగ్ ఎక్కడంటే ? - Baahubali Crown Of Blood Release