Varalakshmi Sarathkumar Marriage Photos :కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, నికోలాయ్ సచ్‌దేవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. థాయిలాండ్‌లోని ఫేమస్ బీచ్‌లో బంధువులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఈ కొత్త జంటకు కంగ్రాజ్యూనేషన్స్ తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా నూతన వధూవరలకు విష్ చేస్తున్నారు.
ఇటీవలే ఈ జంట చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, తమన్, వెంకటేశ్, మంచు లక్ష్మి లాంటి స్టార్స్ రాగా కోలీవుడ్ నుంచి ఖుష్బూ దంపతులు, సిద్ధార్థ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, లాంటి సెలబ్రీటుల వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. శాండల్‌వుడ్ నుంచి కిచ్చా సుదీప్ ఫ్యామిలీ హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలనాటి అందాల తార శోభన కూడా ఈ రిసెప్షన్లో సందడి చేశారు.
సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు వరలక్ష్మీ. హీరోయిన్గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోని ఈ తార, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పవర్ఫుల్ విలన్‌గా సూపర్ పాపులర్ అయ్యారు. జానర్‌తో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.