తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వాలంటైన్స్‌ డే : టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ - ఇవి​​ చెప్పి మనసు దోచేయండి బ్రదర్స్​! - tollywood love diagoues

Valentines Day Tollywood Best Love Dialouges : అబ్బాయి లేదా అమ్మాయి మనసు గెలుచుకోవడం అంత సాధారమైన విషయం కాదు. మన ప్రేమించిన వ్యక్తి దగ్గర ప్రేమను వ్యక్తం చేయడమూ అంత ఈజీ కాదు. మనసులోని భావాన్ని చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ప్రేమ ఎంత అందమైనదో, ఆ ప్రేమను వ్యక్త పరిచే విధానం, చెప్పే విధానం కూడా అంతే అందంగా ఉండాలి. నేడు వాలంటైన్స్​ డే సందర్భంగా కొన్ని టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 1:56 PM IST

Valentines Day Tollywood Best Love Dialouges :అబ్బాయి లేదా అమ్మాయి మనసు గెలుచుకోవడం అంత సాధారమైన విషయం కాదు. మన ప్రేమించిన వ్యక్తి దగ్గర ప్రేమను వ్యక్తం చేయడమూ అంత ఈజీ కాదు. మనసులోని భావాన్ని చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ప్రేమ ఎంత అందమైనదో, ఆ ప్రేమను వ్యక్త పరిచే విధానం, చెప్పే విధానం కూడా అంతే అందంగా ఉండాలి. అందుకే మన తెలుగు సినిమాల్లో రచయితలు ప్రేమను వ్యక్తపరచడానికి, దాని గురించి చెప్పడానికి తమ కలంతో అందమైన మాటలను రాసుకొచ్చారు. నేడు వాలంటైన్స్​ డే సందర్భంగా అందులో కొన్ని మీకోసం.

  • వాన : ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసలిదానివైపోయినా, చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు
  • జాను : పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే.
  • ఒక లైలా కోసం : ప్రాణం అంటూ పోవాల్సి వస్తే అది నీతోనే. లేకపోతే నా ప్రేమకు అర్థమే లేదు
  • కంచె : గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం. ప్రేమిస్తే నీళ్లు పోస్తాం
  • ఆరెంజ్‌ : ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే, జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి.
  • ఆర్య : నీ కోసమే నా అన్వేషణ. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం. కొన్ని వేలసార్లు మరణించైనా సరే. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను
  • నిన్ను కోరి : నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే. లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది?
  • మజిలీ : పెళ్లికి ముందులాగా, పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది
  • మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు : కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!
  • అందాల రాక్షసి : నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను
  • ఓయ్‌ : నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే
  • తీన్‌మార్‌ : మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది.
  • మనం : మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు.

ABOUT THE AUTHOR

...view details