Urvashi Rautela Godlen Cake Birthday Celebrations : బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ' బాసూ - వేర్ ఈజ్ ద పార్టీ' అంటూ చిందులేసి అభిమానులను కట్టిపడేసింది. అలానే అఖిల్ అక్కినేని 'ఏజెంట్', రామ్ పోతినేని 'స్కంద', పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ 'బ్రో', సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో తన అందాలతో, డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకుంది.
అయితే నేడు(ఫిబ్రవరి 25న) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గోల్డెన్ కేక్ కట్ చేసి అభిమానులను షాక్ అండ్ సర్ప్రైజ్ చేసింది. అయినా ఈ భామకు ప్రతి ఏడాది తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటే. అలానే ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేసుకుంది. ఏకంగా 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు హాట్ డిస్కషన్ పాయింట్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'నీ దగ్గర ఉంది డబ్బులా? మంచి నీళ్లా? గోల్డెన్ కేక్ కట్ చేయడం ఏంటి మేడమ్?' అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
"లవ్ డోస్ 2 సెట్లో 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్ చేశాను. సెట్లో నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసినందుకు ధన్యవాదాలు. నా పట్ల మీరు చూపించిన నిజమైన శ్రద్ధ నా కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది" అంటూ బాలీవుడ్ ఫేమస్ సింగర్, ర్యాపర్ హనీ సింగ్‌ను ఉద్దేశించి పోస్ట్ రాసుకొచ్చింది ఊర్వశి. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. కాగా, హనీ సింగ్ రూపొందించిన కొన్ని మ్యూజిక్ వీడియోల్లో ఊర్వశి రౌటేలా సందడి చేసిన సంగతి తెలిసిందే.