Upcoming Webseries Sequel : ఓటీటీలో సినిమాల కన్నా వెబ్ సిరీస్‌లకూ మస్త్ క్రేజ్ ఉంటుంది. భాషా భేదం లేకుండా వాటిని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే వాటికి విశేష ఆదరణ ఎక్కువ దక్కుతుంటుంది. దీంతో సినిమాలకే కాదు ఈ సిరీస్‌లకు కూడా సీక్వెల్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ రాబోతున్న ఆ సిరీస్‌లేంటి? ఇప్పుడు ఎన్నో సీజన్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నాయో చూద్దాం.
The Family Man Amazon Prime Video: ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్‌ల్లో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విభాగంలో పని చేసేఓ వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లతో రూపొందిందీ సిరీస్. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ అండ్ డీకే దర్శకులు.సీజన్ 2లో సమంత నటించింది. ఇప్పుడు సీజన్ 3 త్వరలోనే రానుంది. చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆ మధ్య మనోజ్ చెప్పారు.
Mirzapur 3 Amazon Prime Video : వెబ్‌సిరీసుల్లో మీర్జాపూర్ సిరీస్ ఓ సంచలనం. అలీ ఫజల్, విక్రాంత్ మస్సే, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థిల్లర్‌కు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. 2018 నవంబరు 12న సీజన్ 1, 2020 అక్టోబరు 23న సీజన్ 2 విడుదలై విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా సీజన్ 3 షూటింగ్ కంప్లీట్ అయింది. పార్ట్ 3 కూడా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రానుంది.
Maharani : పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన మహారాణి సిరీస్‌లో హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రధారి. పెద్దగా చదువుకోని ఓ మహిళ ప్రభుత్వంలోని పెద్దలతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వ్యవస్థతో ఆమె ఎలా పోరాడింది అనేదే కథ. కథాంశం. సీజన్ 1కుకరణ్ శర్మ, సీజన్ 2కు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. సౌరభ్ భావే డైరెక్షన్‌లో సీజన్ 3 రాబోతుంది. మార్చి 7 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.