సినిమా పరిశ్రమలో సీక్రెట్ రొమాంటిక్ రిలేషన్షిప్ గాసిప్స్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది బహిరంగంగానే లివింగ్ రిలేషన్ షిప్ మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. వీటి గురించి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రముఖ నిర్మాత రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది! వారిద్దరు ఓ రూమ్‌లో ఉండగా సదరు నిర్మాత భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందట.
వివరాల్లోకి వెళితే. దుబాయ్‌కి చెందిన ఓ సినీ క్రిటిక్ తాజాగా షాకింగ్ ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఆ ట్వీట్ ప్రకారం ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో హీరోయిన్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఇక్కడే కాకుండా ఫారెన్లోనూ గట్టిగానే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా విదేశాలకు వెళ్లారు ఆ సినిమా హీరోయిన్ అండ్ నిర్మాత. అక్కడ ఫొటలు కూడా దిగి కూడా పోస్ట్ చేశారు.
అక్కడే వారిద్దరు ఓ రూమ్‌లో కలిసి ఉన్నట్టుగా, అదే సమయంలో నిర్మాత భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని క్రిటిక్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఆ నిర్మాత సదరు హీరోయిన్‌కు 7 సినిమాల్లో అవకాశం కూడా ఇచ్చారట. 2020 నుంచి వీరిద్దరి మధ్య సీక్రెట్ అఫైర్ నడుస్తున్నట్లు క్రిటిక్ ట్వీట్లో రాసుకొచ్చాడు. ఆ హీరోయిన్ పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. రీసెంట్గా ఓ తెలుగు స్టార్ హీరోతో కలిసి పాన్ ఇండియా చిత్రంలో నటించి భారీ డిజాస్టర్‌ను కూడా అందుకుంది.