Tovino Thomas Vazhakku Movie :సినీ ఇండస్ట్రీ అన్నాక వాగ్వాదాలు సహజమే. అది ఎవరితోనైనా కావచ్చు. అయితే గొడవ పెట్టుకున్న వ్యక్తులు మళ్లీ కలిసిపోవడం మనం చాలాసార్లు చూశాం. కానీ మలయాళం ఇండస్ట్రీలో ఇటీవలే ట్రెండ్ అవుతున్న కాంట్రవర్సీలో తాజాగా ఓ ట్విస్ట్ వచ్చింది. దాని వల్ల ఆ నిర్మాతకు కోట్లలో నష్టం వాటిల్లనుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
మిన్నల్ మురళీ, తల్లుమల లాంటి సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరించారు నటుడు టొవినో థామన్. ఇటీవలే ఆయన లీడ్ రోల్లో 'నడిగర్' అనే సినిమా కూడా విడుదలైంది. మే 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. అయితే అంతకంటే ముందు టొవినో మరో సినిమాలో నటించారు.
'వలక్కు' అనే సినిమాలో టొవినో లీడ్ క్యారెక్టర్లో మెరిశారు. సనల్ కుమార్ శశిధరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా పూర్తయింది. కానీ సెన్సార్‌కు వెళ్లాల్సిన సమయంలో హీరో, డైరెక్ట్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్ హీరోను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన కెరీర్‌పై ఈ మూవీ ఎఫెక్ట్ పడకూదని థియేట్రికల్‌తో పాటు ఓటీటీ విడుదల విషయంలో జోక్యం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. అంతే కాకుండా 2021 నాటికి కల్లా సినిమా పనులు పూర్తైనప్పటికీ హీరో కారణంగానే సినిమా విడుదల కాలేదని తెలిపారు. అయితే ఈ విషయంపై అటు టొవినో కూడా తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఒకవైపు మాత్రమే విని కన్‌క్లూజన్‌కు రాకండి అంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.