TOP Malayam Series In OTT :ఏ ప్రాంతం సినిమాలైనా ఒక్కసారి క్లిక్ అయ్యిందంటే చాలు ఇక వాటిని ఎక్కడి ప్రేక్షకులైన సరే భాషభావం లేకుండా ఆదరిస్తుంటారు. తమ భాషల్లోనూ హిట్ చేస్తుంటారు. ఇటీవలే తెలుగులో హిట్ టాక్ అందుకుంటున్న మలయాళ సినిమాలే అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతి తక్కువ బడ్జెట్‌తో చిత్రాలు రూపొందించి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు మలయాళీ డైరెక్టర్లు. అయితే సినిమాలకే పరిమితమైన ఈ టాక్ ఇప్పుడు మాలీవుడ్ వెబ్ కంటెంట్‌కూ వస్తోంది. దీంతో ఓటీటీ లవర్స్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పాపులరైన మలయాళ సిరీస్‌ల గురించి తెలుసుకుందామా
పోచర్
కేటగిరీ: క్రైమ్ డ్రామా
ప్లాట్ ఫామ్: అమోజాన్ ప్రైమ్
స్టోరీ : అలియా భట్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సిరీస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. వరుస క్రైమ్ లు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని కనిపెట్టడానికి కేరళ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్‌యే కథాంశం.
పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్
కేటగిరీ: పొలిటికల్ - కామెడీ డ్రామా
ప్లాట్ ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
స్టోరీ : మాళవిక అనే మహిళ పంచాయతీ ప్రెసిడెంట్ అవడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నదనేది కథాంశం.
ప్రియపెట్టవల్ పీయూశ్
కేటగిరీ : డ్రామా
ప్లాట్ ఫామ్ : యూట్యూబ్
స్టోరీ : పీయూశ్ తన లవ్ లైఫ్‌లో వచ్చిన సమస్యలను తన ఫ్రెండ్‌తో కలిసి ఎలా ఎదుర్కొన్నాడనేది కథాంశం.
కేరళ క్రైమ్ ఫైల్స్
కేటగిరీ : క్రైమ్ డ్రామా
ప్లాట్ ఫామ్ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
స్టోరీ : ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య వెనుక ఎవరున్నారో పసిగట్టే కోణంలోనే కథ మొత్తం జరుగుతుంటుంది.
ఇన్‌స్టాగ్రామమ్
కేటగిరీ : కామెడీ
ప్లాట్ ఫామ్ : Nee Stream
స్టోరీ : కొందరు వ్యక్తుల మధ్య బంధాన్ని, వాటి విలువలను పరీక్షిస్తూ నడిచే కథ.