Top 10 Trending Movies in Netflix : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో దిగ్గజ సంస్థగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సిరీస్, సినిమాలను అందిస్తోంది. రీసెంట్గా టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోల మోస్ట్ అవైటెడ్ అప్‌కమింగ్ మూవీస్ రైట్స్‌ను కొనుగోలు చేసి మూవీ లవర్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంకా ఈ ప్లాట్ఫామ్లో తెలుగుతో పాటు హాలీవుడ్, కొరియన్, స్పానిష్ పలు భాషల సిరీస్, సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండిగ్‌లో ఉన్న సినిమాలు ఏంటో ఓ సారి చూసేద్దాం. లుక్కేద్దాం.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ - దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన డంకీ గతేడాది డిసెంబర్ 21న సలార్‌కు పోటీగా విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా కాస్తా నిరాశపరిచింది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది.
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన భక్షక్ సినిమా కూడా ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ చిత్రాన్ని నిర్మించారు. సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బాలికలపై జరిగే లైంగిక వేధింపుల కథాంశంతో రూపొందిందీ చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం టాప్ 2 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్ ఫిల్మ్ యానిమల్ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్నో విమర్శలను అందుకుంది.రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం మూడో ప్లేస్‌ను సంపాదించుకుని ట్రెండింగ్ అవుతోంది.