Tillu Cube Movie:టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్వ్కేర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. 2022లో రిలీజైన 'డీజే టిల్లు'కు సీక్వెల్గా తెరకెక్కిన 'టిల్లు స్వ్కేర్' మార్చి 29న విడుదలై భారీ విజయం సొంతం చేసుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్ర్కిప్ట్ అందించగా, దర్శకుడు మల్లిక్ రామ్ రొమాంటిక్ డ్రామాగా చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాకు మూడో పార్ట్ 'టిల్లు క్యూబ్' కూడా ఉంటుందని మూవీయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి కూడా సిద్ధునే స్క్రిప్ట్ అందించనున్నారు. దీంతో తొలి రెండు భాగాల కంటే 'టిల్లు క్యూబ్'పై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కాగా, తాజాగా సినిమా గురించి సాలిడ్ అప్డేట్ తెలిసింది. ఈ సినిమాలో సిద్ధుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారట.
అయితే సినిమా మూడో భాగం కోసం స్క్రిప్ట్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయట. ఇందులో నటించనున్న స్టార్ హీరోకు మంచి పాత్ర రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరన్న విషయం ఇప్పటికైతే తెలియదు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక తొలి రెండు భాగాల్లో యంగ్ నటుడు ప్రిన్స్ కీ రోల్లో మెరిశారు. ఇక ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. షూటింగ్ ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. కాగా, సిద్ధు ప్రస్తుతం 'తెలుసు కదా' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు.