Tollywood Villan Sayaji Shinde Hospitalized:నటుడు సాయాజీ షిండే గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్‌గా, తండ్రిగా, సహాయక పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈయన 2001లో సూరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమ్యారు. ఆ తర్వాత ఠాగూర్, వీడే , ఆంధ్రావాలా, గుడుంబా శంకర్, పోకరి వంటి ఎన్నో చిత్రాల్లో ఆద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈయన తాజాగా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిసింది. హార్ట్‌లో చిన్న బ్లాక్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారని సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రేమికులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
షిండేకు చికిత్సను అందిస్తున్న డాక్టర్ మాట్లాడుతూ - "సాయాజీ షిండే కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. అందుకే మేము కొన్ని మామూలు టెస్ట్‌లు చేశాము. అప్పుడే ECGలో కొన్ని చిన్న మార్పులు కనిపించాయి. యాంజియోగ్రఫీ చేయించుకోమని సలహా ఇచ్చాం. అది చేశాక గుండెలో వాల్స్ బాగానే ఉన్నాయని తెలిసింది. అయితే కుడి వైపు రక్తనాళంలో మాత్రం కాస్త బ్లాక్ అయింది. షిండేకు చికిత్స ఇచ్చినప్పుడు మాకు పూర్తిగా సహకరించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలో డిశ్చార్జ్ చేస్తాము" అని అన్నారు.