Mr Bachan Glimps:టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ సోమవారం వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'షో రీల్' పేరుతో ఈ వీడియో విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్‌తో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీనియర్ నటుడు జగపతిబాబు కూడా టీజర్లో కనిపించారు. మరి మీరు ఈ వీడియో చూశారా?
నో డైలాగ్స్- ఓన్లీ యాక్షన్:ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వీడియో డిజైన్ చేశారు. కేవలం యాక్షన్ సీన్స్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందోనని డైరెక్టర్ హరీశ్ క్లూ ఇచ్చినట్లు ఉన్నారు. రవితేజను ఫుల్ మాస్‌గా చూపించారు. ఆయన ఇన్కమ్ టాక్స్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఇక ఫైట్ సీన్స్‌తో రవితేజ విశ్వరూపం చూపించారు. జగపతి బాబు మరోసారి విలన్ రోల్లో కనిపించనున్నారు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే కూడా టీజర్లో కనిపించింది.
హీరో- హీరోయిన్ మధ్య లవ్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నట్లు అర్థమవుతోంది. చివర్లో రవితేజ బ్యాక్‌గ్రౌండ్‌లో అమితాబ్ బచ్చన్ పోస్టర్ అదిరిపోయింది. ఓవరాల్‌గా ఈ గ్లింప్స్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీతో రవితేజ గట్టి కమ్‌బ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గంటల్లోనే లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.