Ramya behara Anurag Kulkarni Marriage : టాలీవుడ్ సింగర్ అనురాగ్ కులకర్ణి, మరో సింగర్ రమ్య బెహరా సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. వీరి వివాహం ఘనంగా జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ జంట పెళ్లి చేసుకున్నారు అని తెలియడంతో అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సింగర్స్! - ఒక్కటైన అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా - RAMYA BEHARA ANURAG KULKARNI
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సింగర్స్ రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి.
![సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సింగర్స్! - ఒక్కటైన అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా Ramya behara Anurag Kulkarni Marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2024/1200-675-22910574-thumbnail-16x9-marriage.jpg)
Published : Nov 16, 2024, 9:31 AM IST
కాగా, అనురాగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాల్లో వరుసగా సాంగ్స్ పాడుతూ ప్రముఖ సింగర్‌గా మారాడు. ఆర్ఎక్స్ 100 సినిమాలో పిల్లారా సాంగ్ అనురాగ్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. శ్యామ్ సింగరాయ్‌లో ప్రణవాలయ పాటతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
రమ్య బెహరా కూడా ఎన్నో అద్భుతమైన పాటలను పాడి మెప్పించింది. ఈమె సూపర్ సింగర్ 4లో పాల్గొంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణీ ఈమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఒక లైలా కోసం, టెంపర్, లౌక్యం, ప్రేమకథా చిత్రం, చిన్నదాన నీకోసం, కొత్తజంట, ఇస్మార్ట్ శంకర్, దిక్కులు చూడకు రామయ్య, రంగ్ దే, రెడ్, శతమానం భవతి లాంటి సినిమాల్లో రమ్య పాటలు పాడింది.