Tollywood May 9th Release Movies :మన సినిమాలకు అనుకూలంగా ఉండే సీజన్లు పండగ సెలవులు, వేసవి సెలవులు. దసరా, సంక్రాంతికి విడుదల అయితే ఒక వారం రోజులు కంటెంట్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయనే ధీమా నిర్మాతలకు ఉంటుంది. అయితే వేసవి సెలవులు ఇందుకు కాస్త భిన్నంగా ఉంటాయి. ఎక్కువ రోజుల సెలవులు కాబట్టి కంటెంట్‌తో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా మే 9న విడుదలైన కొన్ని సినిమాలు ఇండస్ట్రి హిట్స్‌గా నిలిచి టాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.
1. జగదేక వీరుడు అతిలోక సుందరి(1990) : 1990 మే 9న చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దూకుడుకు ఎండలు కూడా ఆడియెన్స్‌ను థియేటర్లకు వెళ్లకుండా ఆపలేకపోయింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.15 కోట్లు కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రి హిట్‌గా మారింది. ఇదే మూవీ హిందీలో మిస్టర్ ఇండియా పేరుతో రీమేక్ చేశారు.
2. గ్యాంగ్ లీడర్ : 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ కూడా చిరంజీవి మార్కెట్ పెంచింది. విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బప్పి లహరి సంగీతం ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటూ డ్యాన్స్ మూమెంట్స్‌లో చిరంజీవికి ఎవరు సాటి లేరు అని నిరూపించింది.
3. ప్రేమించుకుందాం రా (1997): ఈ సినిమాలో ఒక సీన్ వల్ల లిటిల్ హార్ట్ బ్రాండ్ సేల్స్ బాగా పెరిగాయి అంటేనే ఇందులో ఆ సీన్‌కు ఎంతగా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్, అంజలా జవేరి హీరోహీరోయిన్లగా 1997 మే 9న విడుదలైన ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ముఖ్యంగా లవ్, ఫ్యాక్షన్ కలిపిన కథాంశంతో తెరకెక్కడం అప్పటి ఆడియెన్స్‌కు ఫ్రెష్‌గా అనిపించింది.
4.సంతోషం(2002) : నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ హీరో హీరోయిన్లగా నటించిన సంతోషం కూడా మే 9 న విడుదలయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాదు నాగార్జునకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సంగీతం అందించిన ఆర్ పి పట్నాయక్ కు కూడా ఫిల్మ్ ఫేర్ దక్కింది.