Tollywood Heroines In Cop Role : సాఫ్ట్ క్యారెక్టర్లలోనే కాదు స్ట్రాంగ్ క్యారెక్టర్లతోనూ అదరగొడుతామంటున్నారు స్టార్ హీరోయిన్లు. ఫైట్లు వంటి వాటిలో కూడా మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు కొందరు హీరోయిన్లు. ఖాకీ డ్రెస్సు, చేతిలో లాఠీ పట్టుకుని ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు? ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దామా.
కాజల్ అగర్వాల్:
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో సూపర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటడ్ మూవీలో ఆమె ఈ పాత్ర పోషించారు. అఖిల్ డేగల డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 17న విడుదల కానుంది. అయితే గతంలోనూ కాజల్ 'జిల్లా', 'ఘోస్టీ' వంటి చిత్రాల్లో పోలీసు అధికారిగా కనిపించింది.
చాందినీ చౌదరీ:
'కలర్ ఫొటో', 'గామీ' లాంటి సినిమాలతో పాపులర్ అయిన చాందిని చౌదరీ త్వరలోనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ప్రకాష్ చిత్ర రూపొందిస్తున్న 'యేవమ్' అనే చిత్రంలో ఆమె ఈ పాత్ర పోషించనుంది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌లో చాందినీ ఖాకీ డ్రెస్సులో సీరియస్‌గా కనిపించింది. ఆ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.
త్రిష :
కోలీవుడ్ బ్యూటీ త్రిష ఖాకీ దుస్తుల్లో కనిపించనుంది. 'బృందా' అనే వెబ్ సిరీస్‌లో ఆమె ఈ పాత్ర పోషించనుంది. సూర్ వంగల డైరెక్షన్లో రూపొందిన ఈ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానుంది.