తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలీవుడ్ కోడలైన బాలయ్య భామ - పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్​! - బాలయ్య బాబు హీరోయిన్ పెళ్లి

Tollywood Heroine Askha Pardasany Marriage : సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కింది. అయితే ఈ పెళ్లిలో కొత్త పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్​గా మారింది. ఆ వివరాలు.

Tollywood Heroine Askha Pardasany Marriage
Tollywood Heroine Askha Pardasany Marriage

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 9:39 AM IST

Tollywood Heroine Askha Pardasany Marriage : సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్​ నడుస్తోంది. పలువురు సెలబ్రిటీలంతా వరుసగా తమ బ్యాచిలర్​ లైఫ్​కు గుడ్​బై చెబుతున్నారు. పెళ్లి పీటలెక్కేస్తున్నారు. అలా తాజాగా మరో తెలుగు హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ కోడలైంది. తనే అక్ష పార్ధసాని. తెలుగులో యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

తెలుగులో ఇన్నిసినిమాలు చేసినప్పటికీ అక్షకు స్టార్ స్టేటస్ రాలేదు. 2017 తర్వాత నుంచి ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక టాలీవుడ్​లో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్​కు చెక్కేసింది. హైదరాబాద్ నుంచి ముంబయికి మకాం మార్చేసింది. అక్కడే బాలీవుడ్ లో ఉంటూనే అడపాదడపా పలు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది.

ఈ క్రమంలోనే అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్​తో ప్రేమలో పడింది. అలా కొంతకాలం పాటు డేటింగ్ కొనసాగించిన ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కారు. తమ ప్రేమను పెళ్ళి బంధంగా మార్చుకున్నారు. పెద్దల్ని ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, దగ్గర సన్నిహితులు, స్నేహితులు సమక్షంలో ఈ పెళ్లి ఎంతో సింపుల్​గా వెరైటీగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. నెటిజన్లు, అభిమానులు వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే ఈ పెళ్ళిలో కొత్త పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్​గా మారింది. కౌశల్ సినిమాటోగ్రాఫర్ అన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి ఎంట్రీని డిఫరెంట్​గా ప్లాన్ చేశారు. సాధారణంగా నూతన వరుడిని ఏ గుర్రంమీదనో, కార్లోనో ఊరేగిస్తారు. కానీ ఈ పెళ్లిలో అలా కాకుండా షూటింగ్స్​కు వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్లడం విశేషం. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెగ కామెంట్లు పెడుతున్నారు. నువ్వు రియల్ సినిమాటోగ్రాఫర్ బాసు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగమ్మాయి అంజలి హైడోస్ గ్లామర్ షో - ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది!

SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా - ఆ ఐదు పనులు పూర్తైతేనే మూవీ షురూ!

ABOUT THE AUTHOR

...view details