Vijay Deverakonda Marriage :టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటికే స్పందించారు. తాజాగా ఈ రూమర్స్‌పై ఆయన మరోసారి రియక్ట్ మాట్లాడారు. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు అందరికి చెబుతానని అన్నారు.
'నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో షేర్ చేసుకోవాలి అని నేను అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. అందుకు సమయం రావాలి. దానికంటూ ఒక ప్రత్యేక సందర్భం, కారణం ఉండాలి. అలాంటి సందర్భం వచ్చిన రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో షేర్ చేసుకుంటాను. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తారు. దానిని నేను వృత్తిలో భాగంగానే భావిస్తాను. దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను వార్తలుగా మాత్రమే చూస్తాను. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా' అని విజయ్ దేవరకొండ తెలిపారు.
అనంతరం ఆయన ప్రేమ గురించి కూడా మాట్లాడారు. 'అన్ లిమిటెడ్ లవ్ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే గనక ఉంటే దానితోపాటు బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా భరించాల్సి ఉంటుంది' అని అన్నారు.