Kalki 2898 Rajamouli:ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడా? నటుడా? అని అప్పుడప్పుడు అనుమానం కలుగుతుంది. రీసెంట్ సినిమాల్లో సిల్వర్ స్క్రీన్‌పై రౌజమౌళి ఏదో గెస్ట్ రోల్‌లో మెరుస్తూ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆయన డైరెక్ట్ చేసే సినిమాల్లో నటులు నటించాల్సిన అవసరం లేదట. కేవలం రాజమౌళిని ఇమిటేట్ చేస్తే చాలట. ఈ విషయాన్ని ఆయనతో పాటు పనిచేసిన ఆర్టిస్టులే చెబుతుంటారు. డైరెక్టర్ కాకముందు కూడా ఆయనను నటుడిగానే ట్రై చేయమని కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారట కూడా.
కానీ, టెక్నీషియన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగి మరో వైపు ఆర్టిస్ట్‌గానూ తళుక్కుమంటున్నారు. మొట్టమొదటి సారిగా స్వీయ డైరెక్షన్లో 'సై' చిత్రంలో వేణుమాధవ్‌తో కలిసి ఒక సీన్లో నటించారు. ఆ తర్వాత 'ఈగ' సినిమా చివర్లో బైక్ నడుపుతూ కనిపిస్తారు. ఆ తర్వాత 'రెయిన్ బో', 'మజ్ను' సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ పోషించారు. 'బాహుబలి- 1'లో మద్యం అమ్మే వ్యక్తి పాత్రలోనూ కనిపించి షాక్ ఇచ్చారు. అనంతరం ఆర్టిస్టుగా చాలా మంది డైరెక్టర్లే ఆఫర్ చేసినా రిజెక్ట్ చేస్తూ వచ్చారు.
డైరెక్షన్నే కాదు యాక్టింగ్‌లోనూ సెలక్టివ్‌గా కొన్నింటినే ఎంపిక చేసుకునే రాజమౌళి రీసెంట్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఇప్పుడు సోషల్ ఫాంటసీ సినిమా అయిన 'కల్కి 2898 AD'లోనూ ప్రభాస్‌తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పైగా రాజమౌళి- ప్రభాస్ మధ్య సంభాషణ ఫన్నీగా అనిపిస్తుంది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్‌తో రాజమౌళిపై స్వీట్ సెటైర్ వేయించారు.