Director Krish Marriage :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ వివాహం వేడుకగా జరిగింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాతో ఆయన ఏడడుగులు సోమవారం వేశారు. హైదరబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన పలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాజ్యూలేషన్స్ చెబుతున్నారు. కొత్త జంట బాగుందంటూ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు.
ఇక డైరెక్టర్ క్రిష్ సినీ కెరీర్ విషయానికి వస్తే, 'గమ్యం'తో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన, తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మనసుకు హత్తుకునే సినిమాలు తీయడంలో ఆయన స్పెషలిస్ట్. ఇక 'గమ్యం' తర్వాత 'వేదం', 'కంచె', 'కొండపొలం' లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కంచె సినిమాకు గానూ ఆయన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే గమ్యం సినిమాకు ఆయన ప్రతిష్టాత్మక నంది అవార్డును సొంతం చేసుకున్నారు.