Tillu Square Trailer :యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా అభిమానులకు ఓ సాలిడ్ వీడియోను అందించారు. ఆద్యంతం ఎంట్ర్టైనింగ్గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ఎలా సాగిందంటే ?
టిల్లుకు పెళ్లి చేసేందుకు వాళ్ల బంధువులు ఓ పెళ్లి కూతురు ఫోటో పట్టుకొని ఇంటికి వస్తారు. అక్కడ ఆ అమ్మాయి గురించి చెప్తున్న సమయంలో సిద్ధు ఎంట్రీ ఇస్తాడు. నాకు ఈ పెళ్లి వద్దు అని అంటాడు. దీంతో లవ్ చేసి పెళ్లి చేసుకో అని బంధువులు అనగా, తర్వాత తన లవ్ స్టోరీని వాళ్లకు చెప్పడం మొదలెడుతాడు. ఈ నేపథ్యంలో ఓ పబ్‌లో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్)ని కలిసినప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ను ఈ వీడియోలో క్లుప్తంగా చూపించారు. టిల్లు అనేటోడు నార్మల్ టిల్లు అయితే కాదు నేనొక కారణజన్ముడిని. అంటూ టిల్లు చెప్పే డైలాగ్ చాలా ఫన్నీగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. మొదటి పార్ట్ కంటే ఈ సీక్వెల్ మరింత ఎంటర్టైనింగ్గా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.