Tillu Square OTT :యంగ్ సెన్సేషన్సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్లో వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. రిలీజ్ డేట్ నుంటి పాజిటివ్ టాక్ అందుకుని పలు రికార్డులను బ్రేక్ చేసింది. అనుపమకు కూడా ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు సినీ ప్రియులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
"హిస్టరీ రిపీట్ కావడం సాధారణం. అదే, టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ కూడా రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోని" అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా త్వరగా రిలీజ్ కావాలంటూ నెట్టింటా కమెంట్లు పెడుతున్నారు.
ఇక టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే - 2022లో విడుదలైన 'డీజే టిల్లు' చిత్రానికి కొనసాగింపుగా ఈ 'టిల్లు స్క్వేర్' వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. మార్చి 29న విడుదలైన ఈ మూవీ, రిలీజ్ రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, అనుపమ అందాలతో పాటు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.125 కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు మరో సీక్వెల్‌ను సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. టిల్లు స్క్వేర్ ఎండ్ కార్డ్ పడ్డ సమయంలో మేకర్స్ టిల్లు క్యూబ్‌ను అనౌన్స్ చేశారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ మూడో భాగం గురించి క్లారిటీ ఇచ్చారు.
నాని రికార్డ్‌ను బ్రేక్ చేసిన టిల్లన్న - ఇక మిగిలింది దేవరకొండనే! - Tillu Square Collections
టిల్లు స్క్వేర్ @14 డేస్, ఫ్యామిలీ స్టార్ @7 డేస్ - ఎంత వసూలు చేశాయంటే? - Tillu Square FamilyStar Collections