తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ.100 కోట్ల క్లబ్​లోకి సిద్ధు- బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ డబుల్ జోరు - Tillu Square Collections - TILLU SQUARE COLLECTIONS

Tillu Square Collections: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ- మల్లిక్ రామ్​ కాంబోలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ బ్లాక్​బస్టర్ టాక్ అందుకుంది. మార్చి 29న రిలీజైన ఈ సినిమా 9 రోజుల్లోనే రూ.100కోట్ల వసూళ్లు సాధించింది.

Tillu Square Collections
Tillu Square Collections

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 3:37 PM IST

Tillu Square Collections:టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరణ్ బ్లాక్​బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై 9 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ హౌస్​ఫుల్​ షోస్​లో టిల్లు స్వ్కేర్ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సినిమా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది.

మార్చి 29న థియేటర్లలోకి వచ్చిన టిల్లు స్క్వేర్, రెండో వీకెండ్​లో​ కూడా జోరు ప్రదర్శిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకలో కలిపి దాదాపు రూ.4 కోట్ల కలెక్షన్లు సాధించింది. వీటితో కలిపి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రూ.58 కోట్లు దాటింది, ఇక కర్ణాటకలో రూ. 5 కోట్ల కలెక్షన్లు దాటింది. ఇక రెండో వారాంతంతో పాటు ఉగాది పండుగ కూడా కలిసి వచ్చింది. దీంతో కలెక్షన్ల జోరు కొనసాగచ్చు అని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్లు సిద్ధుని స్టార్ హీరోని చేశాయి. గతంలో 2022లో ఒక ఇంటర్వ్యూలో తను కూడా మరో 3 సంవత్సరాలలో రూ.100కోట్ల క్లబ్​లో చేరాలని ఆశపడుతున్నట్టు చెప్పాడు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత టిల్లు స్వ్కేర్​తో తన కలను నెరవేర్చుకున్నాడు సిద్ధు. డీజే టిల్లుతో ఎంత ప్రభంజనం సృష్టించాడో ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో దానికి డబుల్ స్పీడ్ తో అనుకున్నది సాధించాడు.

Tillu Square Overseas Collection: టిల్లు స్క్వేర్ దేశవ్యాప్తంగానే కాదు, ఓవర్సీస్​లోనూ అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. ఎనిమిది రోజుల్లో ఈ సినిమా రూ.23.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాకు మూడో భాగం కూడా రానున్నట్లు మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేసేశారు. మూడో సీక్వెల్​లో మొదటి భాగంలో నటించిన నేహా శర్మ, రెండో భాగంలో నటించిన అనుపమ కూడా ఒక ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశం ఉందని సమాచారం. సిద్ధుకి పేరుతో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న ఈ 'టిల్లు యూనివర్స్'లో ఇంకెన్ని సినిమాలు వస్తాయో, ఇంకెంతమంది రాధిక, లిల్లీలతో టిల్లు ఎన్ని పాట్లు పడతాడో చూడాలి.

టిల్లు గాడి కోసం రంగంలోకి ఎన్టీఆర్​ - 8 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? - Tillu Square Collections

టిల్లు స్క్వేర్​ @7 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్​ ఇవే - మరో రూ.6 కోట్లు వస్తే! - Tillu Square Collections

ABOUT THE AUTHOR

...view details