తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం మొత్తం 16 సినిమా/సిరీస్​లు - ఆ సెన్సేషనల్​ మూవీ కూడా - poacher crime series ott

This Week OTT Releases : కొత్త వారం వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమా సిరీస్​లు వచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. వాటిలో ప్రధానంగా మూడు చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ వారం మొత్తం 16 సినిమా/సిరీస్​లు - ఆ సెన్సేషనల్​ మూవీ కూడా
ఈ వారం మొత్తం 16 సినిమా/సిరీస్​లు - ఆ సెన్సేషనల్​ మూవీ కూడా

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 6:26 AM IST

This Week OTT Releases : వీకెండ్ ముగిసింది. కొత్త వారం మొదలైపోయింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద దాదాపుగా అన్ని చిన్న సినిమాలే సందడి చేశాయి. వాటిలో ఊరు పేరు భైరవకోన పర్వాలేదనిపించే రెస్పాన్స్​ను అందుకుంది. ఇంకా భ్రమయుగం, ప్రేమలు వంటి మలయాళ చిత్రాలు మంచి టాక్​ను అందుకున్నాయి. అయితే ఈ వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే రాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్​ చూపు ఓటీటీలవైపే ఉంది.

అందుకే ఎప్పటిలాగే ఓటీటీ ఆడియెన్స్​ కోసం పలు చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. అందులో మూడు చిత్రాలు కాస్త ఆసక్తి పెంచుతున్నాయి. అలియా భట్ నిర్మించిన క్రైమ్‌ సిరీస్‌ పోచర్‌, మోహన్‌ లాల్‌ నటించిన మలైకొట్టై వాలిబన్(mohanlal Malaikottai vaaliban ott), దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ(sheena bora murder case ott) ఆసక్తిగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా ఏఏ చిత్రాలు వస్తున్నాయి? ఏఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం..

ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో

  • విల్ ట్రెంట్‌ సీజన్‌-2 (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 21
  • స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21

అమెజాన్ ప్రైమ్​ల

  • మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23(రూమర్ డేట్)
  • పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23

నెట్‌ఫ్లిక్స్​లో

  • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం)- ఫిబ్రవరి 19
  • రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(రియాలిటీ సిరీస్)- ఫిబ్రవరి 19
  • మైక్ ఎప్స్: రెడీ టు సెల్‌ అవుట్(కామెడీ సిరీస్)- ఫిబ్రవరి 20
  • క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21
  • సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22
  • అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
  • మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23
  • త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23
  • ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
  • ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
  • ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23
  • మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24

అందాల భామల చీట్ మీల్- వీళ్ల ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే?

కానిస్టేబుల్‌ ఎగ్జామ్​కు అప్లై చేసిన సన్నీ లియోని!

ABOUT THE AUTHOR

...view details