This week OTT Releases :ఎన్నికల వేడికి తట్టుకోలేం అనుకున్నారో ఏమో ఈ వేసవి సెలవులకు థియేటర్లో తమ సినిమాలను విడుదల చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అయితే ఓటీటీ వేదికలు మాత్రం అందుకు భిన్నంగా వేసవి సెలవులను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి. అన్ని మెయిన్ ఓటీటీ వేదికల్లో ఈ వారం సినిమా/సిరీస్‌ల సందడి బాగానే ఉంది. ఈ వారం విడుదలవుతున్న వాటి లిస్ట్ ఒకసారి చూసేద్దాం.
- థియేటర్ రిలీజ్:
1. రాజు యాదవ్ : గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటించిన రాజు యాదవ్ మే 17న థియేటర్లలో విడుదల కానుంది. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంకిత కారాట్ హీరోయిన్. ఒక వింత సమస్యతో బాధపడే వ్యక్తిగా ఇందులో గెటప్ శ్రీను కనిపిస్తాడు.
2. అపరిచితుడు : 2005లో విక్రమ్ నటించిన అపరిచితుడు ఎన్ని రికార్డులు బద్దలగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రీరిలీజ్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో అపరిచితుడు కూడా మే 17న రీరిలీజ్ కానుంది.
- ఓటీటీ రిలీజ్:
1. ప్రైమ్ వీడియో : మే 16 నుంచి ఔటర్ రేంజ్ అనే ఇంగ్లీష్ సిరీస్ రెండో సీజన్, మే 17 నుంచి 99 అనే ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమ్ కానున్నాయి.
2. నెట్ ఫ్లిక్స్ : మే 15 నుంచి ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ అనే ఇంగ్లీష్ సిరీస్, బ్లడ్ ఆఫ్ జ్యూస్ అనే ఇంగ్లీష్ సిరీస్ రెంజో సీజన్ స్ట్రీమ్ అవ్వనున్నాయి.
ఇంకా మే 16 నుంచి బ్రిడ్జ్గర్టన్ ఇంగ్షీష్ సిరీస్ మూడో సీజన్, మేడమ్ వెబ్ అనే ఇంగ్లీష్ మూవీ స్ట్రీమ్ కానున్నాయి.
మే 17 నుంచి పవర్, థెల్మా ది యునికార్న్ అనే ఇంగ్లీష్ సినిమాలు, ద 8 షో అనే కొరియన్ సిరీస్ స్ట్రీమ్ కానున్నాయి.
3. ఎమ్ ఎక్స్ ప్లేయర్ : ఎల్లా అనే హిందీ సినిమా మే 17 నుంచి స్ట్రీమ్ కానుంది.
4. సోనీ లివ్ : లంపన్ అనే మరాఠీ సిరీస్ మే 16 నుంచి స్ట్రీమ్‌కు సిద్ధమైంది.
5. బుక్ మై షో : గాడ్జిల్లాx కాంగ్: ద న్యూ ఎంపైర్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా మే 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
6. జియో సినిమా : మే 17న జర హాట్కే జర బచ్కే అనే హిందీ మూవీ స్ట్రీమ్ కానుంది.
7. జీ 5 : అదా శర్మ నటించిన బస్తర్: ది నక్సల్ స్టోరీ అనే హిందీ సినిమాతో పాటు తళమై సెయిలగమ్ మే 17 నుంచి స్ట్రీమ్ కానున్నాయి.
8.హాట్ స్టార్: క్రాష్ అనే కొరియన్ సిరీస్ మే 13 నుంచి, చోరుడు అనే తెలుగు డబ్బింగ్ సినిమా మే 14 నుంచి, అంకుల్ సంషిక్ అనే కొరియన్ సిరీస్ మే 15 నుంచి, బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే హిందీ యానిమేటెడ్ సిరీస్ మే 17 నుంచి స్ట్రీమ్ అవ్వనున్నాయి.