This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. మరి వీకెండ్ వచ్చిందంటే ఓ ఓటీటీలో ఏ కొత్త సినిమా, వెబ్ సిరీస్ వచ్చిందో అని తెగ వెతికేస్తుంటారు సినీ ప్రియులు. అందుకే ఆయా ఓటీటీ సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌తో ముందుకొస్తుంటాయి. అలా ఈ వారం మిమ్మల్ని అలరించడానికి తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మరి ఇంతకీ కొత్తగా వచ్చిన ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.
థియేర్లో దేవర - ఈ వీకెండ్లో థియేటర్లలో అందుబాటులో ఉన్న ఏకైక చిత్రం 'దేవర'. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. తొలి రోజు రూ.140 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో - నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం నేచురల్ స్టార్ నాని నటించిన బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం(Saripoda Sanivaram OTT) స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి విశేష ఆదరణ దక్కించుకుంది.
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్ అనే హిందీ చిత్రం కూడా శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహా ఓటీటీలో - ఆహా ఓటీటీలోకి ఈ వారం రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మలయాళ డబ్బింగ్ మూవీ చాప్రా మార్డర్ కేస్, నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 అందుబాటులో ఉన్నాయి. ఆహా తమిళం ఓటీటీలో కాఫీ అనే తమిళ చిత్రం విడుదలైంది.