This Week Movies And OTT Release :సెప్టెంబర్ చివరి వారంలో దేవర సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ వారం మాత్రం టాలీవుడ్ నుంచి ఒకట్రెండు సినిమాలే రిలీజ్ కానున్నాయి. కానీ, తెలుగు మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి ఎవర్గ్రీన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు మాత్రం రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో చూద్దాం.
Gorre Puranam Movie : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు. ఈసారి 'గొర్రె పురాణం' అనే సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వ వహించారు. సెప్టెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Kahan Shuru Kahan Khatam : బాలీవుడ్ రొమాంటిక్ చిత్రం 'కహా షురూ కహా ఖతం' సెప్టెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమాను శౌరబ్ దాస్‌గుప్త తెరకెక్కించారు. ఆయితే ఈ సినిమా కథ మాత్రం 'మిమి', 'జర హట్కే జర బచ్కే' డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అందించారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 20న ఈ మూవీ విడుదల కానుంది.
Yudhra: సిద్ధాంత్ చతుర్వేది- మాళవిక మోహనన్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'యుద్ర'. రవి ఉద్యావర్ దర్శకత్వం వహించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే మాళవిక బాలీవుడ్లో తెరంగేట్రం చేయనున్నారు.
రీ రిలీజ్లు ఇవే
బొమ్మరిల్లు: 2006లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన 'బొమ్మరిల్లు' భారీ విజయం అందుకుంది. అప్పట్లోనే ఈ సినిమా 175 రోజులు ఆడింది. సిద్ధార్థ్- జెనీలియ జంటగా దర్శకుడు భాస్కర్ ఈ సినిమా తెరకెక్కించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికీ యూత్ ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటాయి. అలాంటి సినిమా మళ్లీ థియేటర్స్‌లో అలరించడానికి సిద్ధమైంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో 'బొమ్మరిల్లు' రీ- రిలీజ్ కానుంది.
వెంకీ: మాస్ మహారాజ- శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన 'వెంకీ' 2004లో భారీ దక్కించుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ నటన అదరగొట్టేశారు. ముఖ్యంగా సినిమాలో రైళ్లో ఓ సీన్‌కు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ సినిమా కూడా సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో 'వెంకీ' రీ- రిలీజ్ కానుంది.