Actress Competed With Rekha And Sridevi : దక్షిణాదిలో సూపర్ స్టార్‌డమ్ సొంతం చేసుకుని బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్‌లు చాలా మందే ఉన్నారు. హిందీ ఇండస్ట్రీలో కూడా తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లతో పోటీపడి, దక్షిణాదికి తిరిగొచ్చేసిన నటి గురించి విన్నారా? ఆమె గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
బాలీవుడ్ అరంగేట్రం
తన నటనా జీవితాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు కోమల్ మహువకర్ అలియాస్ రూపిణి. తన తొలి సినిమా 'మిలీ' (1975). ఆ తర్వాత 'కొత్వాల్ సాబ్', 'ఖూబ్‌సూరత్'లో కూడా యాక్ట్ చేశారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులరైన ఆమెకు పెద్దయ్యాక లీడ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో రిషి కపూర్, అనిల్ కపూర్, రాజేష్ ఖన్నా వంటి ప్రముఖ బాలీవుడ్ స్టార్‌ల సరసన పని చేసే అవకాశం వచ్చింది. 'పాయల్ కీ ఝంకార్', 'మేరీ అదాలత్' సినిమాలతో పాపులర్ అయ్యారు. అప్పటి ప్రముఖ తారలు రేఖ, శ్రీదేవితో పోటీ పడ్డారు.
దక్షిణాదిలో సక్సెస్
1980ల చివరి నాటికి రూపిణి తమిళం, తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 'అపూర్వ సహోదర్గల్', 'మైఖేల్ మదన కామ రాజు', 'రాజా చిన్న రోజా', 'కెప్టెన్ ప్రభాకరన్' లాంటి హిట్‌లు అందించారు. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ వంటి దక్షిణ భారత సూపర్ స్టార్లతో కలిసి పని చేశారు.