The Rana Daggubati Show Trailer : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రారంభం కానున్న ఓ ప్రత్యేకమైన షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రానా. 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో ఈ సెలబ్రిటీ టాక్ షో రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అందులో దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి, నేచురల్ స్టార్ నాని, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్, స్టార్ హీరో నాగచైతన్య, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి, అలాగే యంగ్ స్టార్స్ సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీలతో పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారందరూ రానాతో ఎన్నో సరదా విషయాలు పంచుకున్నారు. అంతేకాకుండా పలు గేమ్స్ కూడా ఆడారు. నవంబర్ 23 నుంచి ఇది స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉండగా, ఈ షో నిర్వహణతో పాటు, సృష్టికర్త, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా రానానే కావడం విశేషం. అయితే గతంలో ఈ టాక్ షో గురించి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.