Thandel Day 1 Collections : నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన 'తండేల్' మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. భారీ అంచనాలు నడుమ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం. హిట్ టాక్‌ను సొంతం చేసుకొని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది.
ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. అక్కడ మొదటి రోజు ఈ చిత్రం సుమారు 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దానికి 'అలలు మరింత బలపడుతున్నాయి' అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఇది చూసి ఫ్యాన్స్ త్వరలోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ కూడా రికార్డే :
ఇదిలా ఉండగా, ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్'బుక్‌మై షో'లోనూ 'తండేల్' రికార్డు సృష్టించింది. 24 గంటల్లో దాదాపు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని, అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆ సంస్థ తాజాగా తెలిపింది.
స్టోరీ ఏంటంటే :
సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే 'తండేల్'. తన తండ్రి తండేల్ కావడం వల్ల చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర నుంచి ఓ నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగచైతన్య). అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాల్ని వింటూ వాళ్లకోసం నిలబడటం వల్ల అందరూ అతడ్నే 'తండేల్'గా ఎంచుకుంటారు. ఇక రాజుకి తన చిన్నప్పటి ఫ్రెండ్ సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. బుజ్జితల్లి అంటూ తనను ప్రేమగా పిలుస్తుంటాడు.
ఇక రాజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో తొమ్మిది నెలల పాటు సముద్రంలో గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా? అంటూ ఎదురు చూస్తూ గడుపుతుంటుంది. అయితే ఈ సారి వేటకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలా సముద్రంలోకి వెళ్లాక తుపాను కల్లోలం సృష్టిస్తుంది. దీంతో పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిన రాజు పడవని, అందులోని మత్స్యకారులను అక్కడి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు సత్య రాజు కోసం ఏం చేసింది? శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం నుంచి పాకిస్థాన్ సరిహద్దుల వరకూ వెళ్లి రాజుని, ఇతర మత్స్యకారులను ఆమె విడిపించిందా? రాజు, సత్యలు కలుసుకున్నారా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
రాజు, సత్య కలుసుకుంటారా? - 'తండేల్' ఎలా ఉందంటే?
'సక్సెస్ విషయంలో నేను సంతృప్తిగా లేను- అది సాధించేవరకూ నా సినీ ప్రయాణం ఆగదు'