తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సూర్య 44' షురూ- లైట్స్, కెమెరా, యాక్షన్- గ్లింప్స్ చూశారా? - Suriya 44 - SURIYA 44

Suriya 44 Movie: తమిళ్ స్టార్ హీరో సూర్య- పూజా హెగ్డే లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న సినిమా నుంచి గ్లింప్స్ రిలీజైంది.

Suriya 44
Suriya 44 (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 8:59 PM IST

Updated : Jun 2, 2024, 9:33 PM IST

Suriya 44 Movie:తమిళ్ స్టార్ హీరో సూర్య- పూజా హెగ్డే కాంబోలో ఓ సినిమా తెరెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ 'సూర్య 44' వర్కింగ్ టైటిల్​తో రూపొందుతోంది. స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఆదివారం వీడియో గ్లింప్స్ రిలీజైంది. వీడియోలో హీరో సూర్యను చూపించారు. ఓ సముద్ర తీరాన కూర్చున్న హీరో ఏదో ఆలోచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. బ్యాక్​గ్రౌండ్​లో బీజీఎమ్ గ్రాండ్​గా ఇచ్చారు.

ఇక రీసెంట్​గానే సినిమా క్రూ గురించి అప్డేట్ ఇచ్చిన మేకర్స్, తాజాగా షూటింగ్ ప్రారంభమైనట్లు అనౌన్స్ చేశారు. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా తర్వాత దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు నుంచి వస్తున్న మూవీ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. అందుకు తగ్గట్లే కార్తిక్ సుబ్బరాజు స్టార్ నటీనటులను ఎంపిక చేసుకున్నారు. మలయాళీ స్టార్ యాక్టర్లు జోజు జార్జ్, జయరాం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు యానిమల్ ఫేమ్ బాబీ దేవోల్ నెగిటివ్ రోల్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సినిమాలో ఓ భారీ యాక్షన్​ సీక్వెన్స్​ను అండమాన్ పోర్ట్ బ్లెయర్​లో షూట్ చేసినట్లు తెలుస్తోంది.

హీరోయిన్​గా పూజా
హీరో సూర్య సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ రీసెంట్​గానే అనౌన్స్​ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో పూజ ఒంటి నిండా నగలతో ఎంతో ట్రెడిషినల్​గా కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇక సంతోష్ నారాయణ్ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్​పై వంశీ కృష్ణ రెడ్డి , జ్ఞానవేల్ రాజా, ప్రమోద్ ఉప్పలపాటి ​ సంయుక్తంగా భారీ బడ్డెట్​తో నిర్మిస్తున్నారు. ఇక హీరో సూర్య మరోవైపు 'కంగువా' సినిమాతో బిజీగా ఉన్నారు.

పూజ ఈజ్ బ్యాక్​- ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్- బ్రేక్ ఇస్తుందా? - Pooja Hegde New Movie

స్టార్ హీరో కళ్లలో ఆనందం - తనయుడిని అలా చూస్తూ ఉండిపోయిన సూర్య - Suriya Son Karate

Last Updated : Jun 2, 2024, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details