Indian 2 Release Date:లోకనాయకుడు కమల్ హాసన్- డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు 2' ( ఇండియన్ 2) మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల మేకర్స్ షేర్ చేసిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. కానీ, ఎప్పుడు అనేది డేట్ ప్రకటించలేదు. అయినప్పటికీ జూన్ 13న విడుదల కానుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపించింది.
అయితే ఈ సినిమా రిలీజ్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. పలు కారణాల వల్ల మూవీ మళ్లీ పోస్ట్‌పోన్ కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా చెప్పనట్లు జూన్‌లో కాకుండా భారతీయుడు- 2ని జూలైకి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ డేట్‌ను జూలై 13కు మార్చేందుకు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారట. మరి ఈ వాయిదా అండ్ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్లుగా స్టార్లు: సినిమా రిలీజ్‌కు ముందు మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మే 16న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల టాక్. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు వేదిక కానుందట. అయితే ఈ గ్రాండ్ లాంఛ్‌కు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సమాచారం.