తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

60 కోట్ల విలువైన వజ్రం చోరీ - ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన తమన్నా క్రైమ్ థ్రిల్లర్​

తమన్నా నటించిన కొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ - నేరుగా ఓటీటీ రిలీజ్​కు సిద్ధం

Tamannah Sikandar Ka Muqadab
Tamannah Sikandar Ka Muqadab (source IANS)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Tamannah Sikandar Ka Muqadab: హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సినిమాల విషయంలో జోరు చూపిస్తూ ముందుకెళ్తోంది. ఓ వైపు లీడ్ రోల్స్​ మరోవైపు స్పెషల్ సాంగ్స్​ చేసుకుంటూ కెరీర్​లో రాణిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో క్రైమ్​ థ్రిల్లర్​ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ కానుంది. సికందర్ కా ముకద్దర్​​ పేరుతో ఇది రానుంది. చిత్రంలో తమన్నాతో పాటు జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ కూడా ప్రధాన పాత్ర పోషించారు. రూ.60 కోట్ల విలువైన వజ్రం చోరీ చుట్టూ తిరిగే కథతో ఇది తెరకెక్కింది.

"60 కోట్ల విలువైన వజ్రం చోరీ. ఓ సుదీర్ఘమైన వెతుకులాట. ఓటమిని అంగీకరించని ఓ ఇన్‌స్పెక్టర్. సికందర్ కా ముకద్దర్​​ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్​లోకి రానుంది" అనే క్యాప్షన్​తో బిహైండ్​ ది సీన్స్​ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇందులో ప్రధాన పాత్రలపై చిత్రీకరించిన సన్నివేశాలను చూపించారు. చివరిలో సినిమా దర్శకుడు నీరజ్ పాండే కనిపించారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్​ను అనౌన్స్​ చేయనున్నారు.

ఈ సికందర్ కా ముకద్దర్​​ మూవీని ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే డైరెక్ట్ చేశారు. నీరజ్ పాండే ఈ మధ్యే చెన్​గిజ్​తో (Chengiz) పాటు అజయ్ దేవగన్, టబు నటించిన ఔరో మే కహా దమ్ థా చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్​గా తమన్నా 'స్త్రీ 2'లో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

Tamannah Bhatiya Upcoming Movies : కాగా, గత కొంత కాలంగా ఓటీటీలపై ఎక్కువ దృష్టి పెట్టింది తమన్నా. 11th అవర్​, నవంబర్ స్టోరీ, మాస్టర్​ చెఫ్​, జీ కర్దా, ఆఖ్రీ సచ్​ వంటి ప్రాజెక్ట్​లను ఓటీటీల్లో చేసింది. ప్రస్తుతం డేరింగ్ పార్ట్నర్స్(హిందీ) ​ కోసం పని చేస్తోంది. ఇక థియేటర్ రిలీజ్ విషయానికొస్తే ఆమె ఓదెల 2 చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

'రాజా సాబ్​' బర్త్​డే స్పెషల్ మోషన్ పోస్టర్ - సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ

డార్లింగ్ బర్త్​డే స్పెషల్ - ప్రభాస్ గురించి ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details