Tamannaah Bhatia Rents 19 Lakhs :మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలోనే ఉంటూ బానే సంపాదించింది. ఇంగ్లీష్ కథనాల ప్రకారం ఆమె నెట్ వర్త్ ప్రస్తుతం రూ.120 కోట్ల వరకు ఉంటుందట. అయితే ఈమె తాజాగా ముంబయిలోని తన 3 ఫ్లాట్స్‌ను తనఖాపెట్టి ఆ డబ్బుతో మరో చోట ఓ కమర్షియల్ ప్రాపర్టీని రెంట్‌కు తీసుకున్నట్లు తెలిసింది. దానికి నెలకు రూ.19లక్షల చొప్పున రెంట్ ఇచ్చేందుకు సిద్ధమైందట.
ముంబయి జుహూ ఏరియాలోని వెస్టరన్ వైండ్ బిల్డింగ్‌లో 6వేల 65 చదరపు అడుగుల ప్రాపర్టీని అద్దెకు తీసుకుంది. దీని కోసం రూ.72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. అలానే స్టాంప్ డ్యూటీగా రూ.2.9లక్షలు చెల్లించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రాపర్టీకి మూడేళ్ల తర్వాత నాలుగో సంవత్సరం నుంచి రూ.20.16 లక్షలు, ఐదో సంవత్సరం నుంచి రూ.20.96లక్షల అద్దె చెల్లించాలట.
3 ప్లాట్లు తనఖా - అలానే తమన్నా ముంబయిలోని తన మూడు ప్లాట్లను రూ.7.84 కోట్ల కోసం తనఖా పెట్టినట్లు తెలిసింది. వెస్ట్ అంధేరీలోని లోఖంద్వాలాలో ఉన్న 2595 చదరపు అడుగులున్న ప్లాట్లను 2024 మే30నే మార్ట్‌గేజ్‌కు ఇచ్చిందట. వీటి కోసం రూ.4.7 లక్షల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు తమన్నా ఈ కమర్షియల్ ప్రాపర్టీతో ఏం చేయబోతుందా అని ఆరా తీయడం ప్రారంభించారు. కాగా, రీసెంట్గా అమీర్ ఖాన్ కూడా ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ముంబయిలో బాంద్రాకు పక్కనే ఉన్న పాలి హిల్‌లో రూ.9.75 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారట.
ఇక తమన్నా సినిమా విషయానికొస్తే ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్గా బాక్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం వేద, స్త్రీ 2, ఒదెల 2 చిత్రాల్లో నటిస్తోంది.