Taapsee Pannu Marriage:హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో, ఇతర మీడియా వెబ్సైట్లతో వార్తలు జోరుగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. అయితే తాజాగా దీనిపై నటి తాప్సీ స్పందించారు. తనపై ప్రచారం చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
సొట్ట బుగ్గల సుందరి, రింగుల జట్టు అమ్మాయిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ 'ఝమ్మంది నాదం' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'మొగుడు', 'దరువు', 'గుండెల్లో గోదారి', 'సాహసం', 'నీడ', 'ఆనందోబ్రహ్మ', 'ఘాజీ', 'నీవెవరో' వంటి చిత్రాల్లో నటించారు. ఇక కోలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ పెద్ద స్టార్ హీరోయిన్ కాలేదు.
దీంతో ఆమె బాలీవుడ్‌కు చెక్కేశారు. అక్కడ 'పింక్' చిత్రంతో పెద్ద హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'ముల్క్' , 'బడ్లా', 'తప్పడ్' వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్‌లను ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. రీసెంట్గా గతేడాది డిసెంబర్లో షారుక్ ఖాన్‌తో కలిసి 'డంకీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు కానీ మంచి వసూళ్లను సాధించింది.