ఆయన ఓ సూపర్ స్టార్. ఆ హీరో స్టైల్, లుక్, పర్ఫార్మెన్స్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ సూపర్ హిట్ మూవీలు అందించారు. తన నటనతో జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కానీ అ తన జర్నీని ఓ సామాన్యుడిలానే ప్రారంభించారు. రూ.750 జీతానికి పని చేశారు. ఎవరా హీరో అని ఆలోచిస్తున్నారా? ఆయనే సూర్య.
సూర్య విద్యాభ్యాసం
తమిళనాడులో నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకు 1975 జులై 23న సూర్య జన్మించారు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు. ఒకరు కార్తీ, మరొకరు బృందా. సూర్య పద్మశేషాద్రి బాల భవన్ స్కూల్, చెన్నైలోని సెయింట్ బెడేస్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివారు. లయోలా కళాశాల నుంచి డిగ్రీ, బీకామ్ పూర్తి చేశారు.
ఫ్యాక్టరీలో పని
Suriya Biography : సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు, సూర్య గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ ఫ్యాక్టరీలో 6 నెలలు పనిచేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక పాపులర్ యాక్టర్ కొడుకు అనే విషయం బయటపెట్టకుండా అక్కడ పని చేశారు. డిగ్రీ తర్వాత అదే ఆయన మొదటి ఉద్యోగం. ఒక గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో చేరానని, చాలా బాగా పని చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తన మొదటి జీతం రూ.750 అని, యజమాని తను ఎవరో గుర్తు పట్టడం, వర్క్ రొటీన్‌గా అనిపించడం వల్లే మానేసినట్లు చెప్పారు. సూర్యకు మొదట్లో వసంత్ తన 'ఆసై' (1995) సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ చేశారు. కానీ అప్పుడు యాక్టింగ్‌పై ఆసక్తి లేకపోవడం వల్ల సూర్య ఆఫర్‌ని తిరస్కరించారు.
సూర్య సినిమా కెరీర్
శరవణన్ శివకుమార్ (స్టేజ్ నేమ్ సూర్య) 1997లో 'నెరుక్కునెర్'తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో దళపతి విజయ్ కూడా నటించారు. 2001లో వచ్చిన నందా మూవీ సూర్యకి స్టార్‌డమ్ తీసుకొచ్చింది. 2003లో కాఖా కాఖాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు.